- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామం.. మోహం.. విపరీతమైన కాంక్ష.. నిజం చెప్పాలంటే నా జీవితమే ఒక లస్ట్
స్టార్ నటి కాజోల్ తాను నటించిన లేటెస్ట్ మూవీ ‘లస్ట్ స్టోరీస్ 2’ వివాదంపై స్పందించింది.

దిశ, సినిమా: స్టార్ నటి కాజోల్ తాను నటించిన లేటెస్ట్ మూవీ ‘లస్ట్ స్టోరీస్ 2’ వివాదంపై స్పందించింది. అమిత్ ఆర్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్, కొంకణా సేన్ శర్మ దర్శకత్వంలో నాలుగా భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్ర సెకండ్ పార్ట్ జూన్ 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న కాజోల్ లస్ట్ అనే పదంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై మాట్లాడింది. ‘మీ ఉద్దేశంలో లస్ట్ అంటే ఏమిటి? అని ప్రశ్నించగా.. ‘కామం. మోహం. విపరీతమైన కాంక్ష. అయితే లస్ట్ అనే పదానికి ఎవరికి నచ్చినట్లు వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇదొక గాఢమైన కోరిక మాత్రమే. అది ఏ విషయంలోనైనా కావొచ్చు. నిజానికి నా జీవితమే ఒక పెద్ద లస్ట్‌గా భావిస్తా. ఇష్టమైనది తినడం, తిరగడం, మొత్తంగా జీవించడంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటా. దీన్నే నేను లస్ట్‌గా అర్థం చేసుకుంటా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.






