ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేను.. సదానాతో 30ఏళ్ల గ్యాప్‌పై కాజోల్

by Disha Web Desk 7 |
ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేను.. సదానాతో 30ఏళ్ల గ్యాప్‌పై కాజోల్
X

దిశ, సినిమా : 30 ఏళ్ల తర్వాత తన స్నేహితుడు కమల్ సదానాను కలిసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటోంది కాజోల్. 1992లో వచ్చిన 'బెఖుడి'లో కలిసి నటించిన వీరిద్దరూ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'సలాం వెంకీ'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నట్లు తెలిపిన కాజోల్.. తాజాగా విడుదల చేసిన 'సలాం వెంకీ' ట్రైలర్ ఈవెంట్‌లో తెగ హంగామా చేసింది. షూటింగ్ మొదలయ్యేంత వరకు దర్శకనిర్మాతలు ఈ విషయం చెప్పలేదని పేర్కొంది.

'మొదటి ఐదు నుంచి పది నిమిషాలు నేను ఏమీ మాట్లాడలేదు. అరుస్తూనే ఉన్నా. నిజంగా ఈ అనుభూతి బాగుంది. మేము ఈ మధ్య కలుసుకుంటూనే ఉన్నాం. ఒకరికొకరం బాగోగులు తెలుసుకుంటున్నాం. కానీ మళ్లీ తనతో కలిసి పనిచేయడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది' అంటూ వివరించింది. ఇక ఇదే విషయంపై స్పందించిన దర్శకురాలు రేవతి.. 'సినిమాలో కమల్‌ నటిస్తున్న విషయాన్ని నేను కాజోల్‌కి చెప్పలేదు. వీరిద్దరి మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశం ఉంది. ఇది ఆమెకు పెద్ద ఆశ్చర్యం కలిగించింది' అని చెప్పింది. ఇక 'కాజోల్‌తో మళ్లీ షూటింగ్ చేస్తున్నపుడు నేను ఇంకా 'బెఖుడి' సెట్స్‌లో ఉన్నట్లే ఫీల్ అయ్యాను. ఆమె ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతోంది. అందుకే నేను నా కుర్చీ ఎత్తుకుని మరో వైపుకు వెళ్లాల్సి వచ్చింది' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు సదానా. ప్రస్తుతం ఈ వీడియో వైలర్ అవుతుండగా డిసెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఫుల్ జోష్‌లో Kiara Advani తో చిందులేసిన కత్రిన భర్త.. ఆమె రియాక్షన్ ఏంటంటే;

Next Story