- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ కు రూ.240 కోట్ల ఆస్తులా... ఖరీదైన ఫ్లాట్స్ కూడా ?
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొందరు మాత్రమే పాపులర్ అవుతూ

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొందరు మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో కాజోల్ ( Kajol) ముఖర్జీ ఒకరు. మహారాష్ట్రకు చెందిన ఈ అందాల తార... చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బడా హీరోలతో సినిమాలు చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించారు కాజోల్.
అయితే అలాంటి కాజోల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె సంపాదించిన ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు మొత్తం 240 కోట్ల వరకు సంపాదించిందట. ఇందులో ఆమె రియల్ ఎస్టేట్ ద్వారా ఏకంగా 180 కోట్లు సంపాదించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సినిమాల కంటే రియల్ ఎస్టేట్ లోనే ఆమెకు లాభాలు ఎక్కువగా వచ్చినట్లు చెబుతున్నారు.
అలాగే ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో ఆమెకు ఫ్లాట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లింకింగ్ రోడ్ లోని గోరేవార్ లో దాదాపు 30 కోట్ల విలువైన ఆస్తి ఉందట. ఇలా ముంబైలో ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆమెకు ఖాళీ స్థలాలు, ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉండడం గమనార్హం. కానీ ఆమె అధికారికంగా 180 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారట. బహిరంగ మార్కెట్ ప్రకారం 250 కోట్లు ఆమె ఆస్తి ఉంటుందని కూడా చెబుతున్నారు.






