కొంటెచూపుతో కాజల్ ట్రెండీ లుక్ అదరహో.. పిక్స్ వైరల్

by Disha Web |

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఒక ఊపూపిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా వరుస చిత్రాలకు సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో వివాహం చేసుకొని గతేడాది పండంటి మగబిడ్డకూ జన్మనిచ్చింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కాస్తా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది.

ఇక నుంచి కాజల్ అగర్వాల్ చేయబోయే పాత్రలు చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో నటించిన ‘ఘోస్టీ’తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ‘ఉగాది’కి ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా ట్రెండీ వేర్స్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఎల్లో ప్రింటెడ్ షర్ట్ లో, బ్లూ బాగీ టైమ్ జీన్స్ లో స్టైలిష్ గా మెరిసింది. ఈ క్రమంలో ఫొటోలకు తన కొంటె చూపులతో మతిపోయేలా ఫోజులిచ్చింది. చెక్కుచెదరని అందంతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేంది. దీంతో ఫ్యాన్స్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Also Read..

వయ్యారాలతో మత్తెక్కిస్తున్న సోనాక్షి.. ఇన్ స్టాలో పిక్స్ వైరల్Next Story