కాజల్ అగర్వాల్ కు లైఫ్ ఇచ్చిన ఆ లేడీ ఎంపీ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులర్

కాజల్ అగర్వాల్ కు లైఫ్ ఇచ్చిన ఆ లేడీ ఎంపీ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయితే.. మరి కొంతమంది సక్సెస్ కావడానికి చాలా టైం పడుతుంది. కానీ.. కొంతమంది హీరోయిన్లు ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే వాళ్ళ స్టార్డం ఏ మాత్రం తగ్గదు. అలాంటి హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ( Tollywood Industry)... సింగిల్ హ్యాండ్ తో ఏలుతోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. హీరోయిన్ గా అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటు పెళ్లయినా కూడా ఆమెకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే.. మంచు విష్ణు ( Manchu Vishnu) నటిస్తున్న..కన్నప్ప ( Kannppa) సినిమాలో కూడా.. కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాలో పార్వతి పాత్ర కాజల్ అగర్వాల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మొదట కాజల్ అగర్వాల్ కాకుండా కంగనా రనౌత్ ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని ఆఫర్ చేశారట. కానీ అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం.. ఆ తర్వాత కంగనా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పార్వతీ దేవి పాత్రను కంగనా రిజెక్ట్ చేశారట. దీంతో ఆ పాత్ర కాస్త కాజల్ అగర్వాల్ కు వచ్చింది. తన వద్దకు రావడంతో... వెంటనే కాజల్ కూడా ఓకే చెప్పారు. ఈ సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు కాజల్ పాత్ర ఉంటుందని చెబుతున్నారు.

Next Story