Kajal Aggarwal: సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్.. అవసరమా అంటూ నెటిజన్ల ట్రోల్స్

by Mallepaka Hamsa |

తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేసిన హీరోయిన్లలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కూడా ఒకరు.

Kajal Aggarwal: సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్.. అవసరమా అంటూ నెటిజన్ల ట్రోల్స్
X

దిశ, సినిమా: తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేసిన హీరోయిన్లలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కూడా ఒకరు. ఈ అమ్మడు సినిమాలే కాకుండా స్పెషల్ సాంగ్, వెబ్ సిరీస్‌లు చేసి పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. సినిమా కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉండగా.. పెళ్లి చేసుకుంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ వరుస మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం కాజల్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa)లో పార్వతీ దేవిగా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ‘ఇండియన్-3’(Indian-3) మూవీలోనూ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, కాజల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా చాన్సులు తక్కువైన కారణంగా.. కాజల్ మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారాలని అనుకుంటున్నట్లు టాక్. స్వీయ దర్శకత్వంలో హీరోయిన్‌గా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో కమర్షియల్ అంశాలతో ఓ సినిమాను తెరకెక్కించడానికి కాజల్ సన్నాహాలు కూడా చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మూవీస్ చేసుకోక రిస్క్ తీసుకోవడం అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు.

Next Story