ఇండస్ట్రీలో నైతిక విలువలు లేవు.. కాజల్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 10 |
ఇండస్ట్రీలో నైతిక విలువలు లేవు.. కాజల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీ కల్చర్‌పై స్టార్ నటి కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ‘సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్’ అనే ఇష్యూపై తాజా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించిన నటి.. దక్షిణాదిలో ఉన్న విలువలు బాలీవుడ్‌లో లేవని చెప్పింది. అంతేకాదు తాను ముంబైకి చెందిన అమ్మాయే అయినప్పటికీ కెరీర్ మాత్రం హైదరాబాద్‌లో మొదలైనట్లు తెలిపింది. ‘నేను బాలీవుడ్ కంటే తమిళ, తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా నటించాను. చెన్నై, హైదరాబాద్‌లే నా సొంత ఇళ్లుగా భావిస్తా. ఎందుకంటే ఇక్కడే స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉన్నవాళ్లను ప్రేక్షకులు ఆదరిస్తారు. కంటెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ, బాలీవుడ్‌లో లోపించాయని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.

ఇవి కూడా చదవండి: Sai Pallavi: నా మొటిమలు, వాయిస్.. అభద్రతా భావానికి గురిచేశాయి

Next Story

Most Viewed