7/G Brindavan Colony మూవీలో కాజల్ అగర్వాల్.. ఏ సీన్ లో ఉందో తెలుసా..?

by Disha Web Desk 10 |
7/G Brindavan Colony  మూవీలో కాజల్ అగర్వాల్.. ఏ సీన్ లో ఉందో తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: తెలుగు సినీ చరిత్రలో ఎన్నో ప్రేమకథల సినిమాలు వచ్చాయి. వాటిలో 7/G బృందావన్‌ కాలనీ మూవీ చాలా ప్రత్యేకం. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో, హీరోయిన్ గా నటించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కోలీవుడ్ కంటే తెలుగులో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక సినిమా వచ్చి ఇప్పటికి 19 ఏళ్లు గడిచినా టీవీల్లో వస్తుందంటే చాలు సినీ లవర్స్ స్క్రీన్‌కు అతుక్కుపోతుంటారు. అలాంటి మూవీ శుక్ర‌వారం రోజు రీ-రిలీజ్ అయ్యింది.ఇక మొదటి రోజే ఈ సినిమా ఏకంగా రూ. కోటికి పైగా క‌లెక్ష‌న్స్ వసూలు చేసింది. ఈ మూవీలో మేం వ‌య‌సుకు వ‌చ్చాం పాట ఎంత ఫేమసో ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పాట‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్ జూనియర్ ఆర్టిస్టుగా డ్యాన్స్ చేసిన‌ట్లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ పాట చూసిన తర్వాత కొందరు నెటిజెన్స్.. సినిమాల్లోకి రాక ముందు కాజల్ సైడ్ డాన్సర్ గా చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed