వింటర్ వెకేషన్​ కోసం.. స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్

by Dishafeatures1 |
వింటర్ వెకేషన్​ కోసం.. స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చరణ్ సరసన ‘మగధీర’ సినిమాతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న కాజల్.. ‘చందమామ’ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరై ‘ఆర్య 2’ తో ఓ రేంజ్​లో క్రేజ్ సంపాదించుకుంది. అలా ఎంట్రి ఇచ్చిన అనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఇక కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే 2020లో గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్.. పండంటి మగ బిడ్డకి కూడా జన్మనిచ్చింది. అప్పటి నుండి కాజల్ తన ప్రతి మూమెంట్​ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ లు ఉన్న సరే.. ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిన్నది ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్​ వెలింది. అక్కడి విశేషాలను తనకు సంబంధించిన ఫోటోలను ఇన్​స్టా ద్యారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. ప్రజంట్ ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.






Next Story