మిత్రవిందను పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌‌గా మార్చేస్తున్న జక్కన్న.. ప్లాన్ అదిరిపోయిందిగా!

by Disha Web Desk 9 |
మిత్రవిందను పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌‌గా మార్చేస్తున్న జక్కన్న.. ప్లాన్ అదిరిపోయిందిగా!
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇకపై సరికొత్త పంథాతో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’తో బిగ్ హిట్ అందుకున్న ఆయన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోయే సినిమాలో పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం మొదట ఐశ్వర్యరాయ్‌ని ఎంచుకున్నప్పటికీ కొన్నికారణాల వల్ల ఆమె నో చెప్పిందని, దీంతో కాజల్‌ అగర్వాల్‌‌తో రాజమౌళి చర్చలు జరిపి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లేడీ విలన్ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట. ఇక ‘మగధీర’లో మిత్రవిందగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్‌.. మళ్లీ అదే రాజమౌళి దర్శకత్వంలో నెగెటివ్‌ పాత్ర చేయబోతుండటం నిజంగా ఆసక్తికరమైన విషయమే. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.



Next Story