బాల‌య్య సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు..గోపిచంద్ ప్లాన్ ఇదే !

by velandi.Saikiran |

కాజల్ అగర్వాల్ ను రెండో హీరోయిన్ గా గోపీచంద్ మలినేని తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

బాల‌య్య సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు..గోపిచంద్ ప్లాన్ ఇదే !
X

దిశ‌, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూనే, అటు రాజకీయాల్లో కూడా దూసుకు వెళ్తున్నారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తున్నారు బాలయ్య. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నందమూరి బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.

కాజ‌ల్ అగ‌ర్వాల్ కు ఛాన్స్‌

సముద్రపు నివాసిగా, అలాగే ఓ రాజ్యానికి రాజుగా కనిపిస్తారట. ఇక ఈ మూవీలో నయనతార ఇప్పటికే ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది. సముద్ర ఖని పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్లు చర్చ జరుగుతోంది. కాజల్ అగర్వాల్ ను రెండో హీరోయిన్ గా గోపీచంద్ మలినేని తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. నయనతార స్థానంలోనే కాజల్ అగర్వాల్ ను ముందుగా అనుకున్నారట. కానీ ఇద్దరు హీరోయిన్లను చివరి క్షణంలో ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమా వచ్చే దసరా నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story