70 ఏళ్ల వయసులో నటుడి నాలుగో పెళ్లి

by Sujitha Rachapalli |

ప్రముఖ నటుడు కబీర్ బేడీ బాలీవుడ్‌లో తనకో పేజీ రచించుకున్నాడు. బెస్ట్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు చూశాడు. ముఖ్యంగా ఆయన పెళ్లి ఎప్పుడూ హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉండేది.

70 ఏళ్ల వయసులో నటుడి నాలుగో పెళ్లి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు కబీర్ బేడీ బాలీవుడ్‌లో తనకో పేజీ రచించుకున్నాడు. బెస్ట్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు చూశాడు. ముఖ్యంగా ఆయన పెళ్లి ఎప్పుడూ హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉండేది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పిల్లలతో ఛీ అనిపించుకుని దూరం పెట్టబడ్డాడు. నాలుగో పెళ్లి పర్వీన్ దుసాంజ్‌తో కాగా ఆయన కంటే ఆమె 29ఏళ్లు చిన్నది కావడం విమర్శలకు దారితీసింది. అంతేకాదు ఈ ఇద్దరు పదేళ్లు డేటింగ్ చేశాక.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్వీన్ తన లైఫ్‌‌ను పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా మార్చేసిందని.. అందుకే తనను పెళ్లి చేసుకున్నానని ఓ ప్రకటనలో తెలిపాడు.

అయితే పర్వీన్‌తో కబేర్ బేడీ పెళ్లి ఆయన కూతురు పూజా బేడీకి నచ్చలేదు. వివాదాలకు దారితీసింది. ఈ క్రమంలో సవతి తల్లి గురించి నెగెటివ్ ట్వీట్ చేసిన ఆమె.. మళ్లీ డిలీట్ చేసింది. ఈ విషయంలో విభేదాలతో తండ్రితో దాదాపు మూడేళ్లు మాట్లాడలేదు కూడా. కాగా కబీర్ బేడీ ముందుగా ప్రోటిమా బేడిని పార్ట్‌నర్‌గా ఎంచుకున్నాడు. 1969లో వీరి పెళ్లి కాగా 1977లో విడిపోయారు. ఆ తర్వాత సుసాన్ హంఫ్రీస్‌ను 1980లోపెళ్లి చేసుకుని.. 1990లో విడాకులిచ్చారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత నిక్కీ బేడీని భాగస్వామిగా ఎంచుకుని.. 2005లో తనను కూడా వద్దనుకున్నాడు. ఆ తర్వాత దాదాపు పదేళ్లు పర్వీన్‌తో డేటింగ్ చేసి 2016లో.. ఆయన 70వ పుట్టినరోజున పెళ్లి చేసుకున్నాడు కబీర్ బేడీ. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారణం కిరణ్ బేడీ, తన కూతురు పూజా బేడీతో కనిపించడమే. కాగా ఈ వయసులోనూ తాత భలే హ్యాండ్సమ్‌‌గా ఉన్నాడని అంటున్నారు నెటిజన్లు.

Next Story