- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బలగం’ బ్యూటీతో కాలభైరవ ప్రేమాయణం.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో
ఇక సినిమా కన్నా ఎక్కువగా ఇప్పుడు కావ్య వ్యక్తిగత విషయాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమై, తనదైన నటనతో మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్.. ‘బలగం’ సినిమాతో హీరోయిన్‌గా మారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఘనవిజయం తర్వాత ఈ బ్యూటీ తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించింది. కుంచం శంకర్ దర్శకత్వంలో, టి.డి. దినకరన్ రెడ్డి నిర్మాణంలో ఒక అందమైన ప్రేమకథా చిత్రంలో కావ్య నటిస్తోంది. టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నంబర్ 1’గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి. ఇక సినిమా కన్నా ఎక్కువగా ఇప్పుడు కావ్య వ్యక్తిగత విషయాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవతో కావ్య ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఒక వేడుకలో కావ్య, కాలభైరవ చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ కనిపించిన ఒక వీడియో బయటకు వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన వారంతా.. వీరిద్దరూ పక్కాగా ప్రేమించుకుంటున్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయం" అంటూ చర్చించుకుంటున్నారు. ఈ ఒక్క వీడియోతో కావ్య పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. మరి ఈ వార్తలపై అటు కీరవాణి ఫ్యామిలీ కానీ, ఇటు కావ్య కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.






