- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కె-ర్యాంప్’ థర్డ్ సింగిల్ అప్డేట్.. కిరణ్ అబ్బవరం క్రేజీ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) వరుస సిపిమాలతో ఫుల్ జోష్‌లో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) వరుస సిపిమాలతో ఫుల్ జోష్‌లో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విభిన్న కథలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల ‘క’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజ (Yukthi Tareja)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను హాస్య మూవీస్, రుద్రాన్షి బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో నరేష్ కీలక పాత్రలో కనిపించడగా.. ‘కె-ర్యాంప్’(K-Ramp)కు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు.
తాజాగా, ‘కె-ర్యాంప్’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసి ఫుల్ జోష్‌తో ఉన్న చిత్రబృందం.. ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు అధికారక ప్రకటన విడుదల చేశారు. తిక్కల్.. తిక్కల్ అని సాగే ఈ పాట సెప్టెంబర్ 4న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో కిరణ్ అబ్బవరం ఓ చర్చిలో వైట్ కలర్ షర్ట్ ధరించి మెడలో గులాబి పూల మాల.. నొట్లో బంతిపువ్వు పెట్టుకుని షాక్ అవుతూ కనిపించాడు. ఆయన చుట్టూ కొందరు బ్యాండ్ వాయిస్తూ కనిపించగా.. హీరోయిన్ సెల్ఫీ తీసుకుంటుండగా.. నటి సీతూ నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ క్రేజీ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరాయాసిటీని పెంచుతోంది.






