Boys Hostel movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బాయ్స్‌ హాస్టల్‌’ మూవీ!

by Disha Web Desk 13 |
Boys Hostel movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బాయ్స్‌ హాస్టల్‌’ మూవీ!
X

దిశ, సినిమా: ఇటీవల కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మూవీ ‘హాస్టల్ హుదుగురు బెక‌గిద్దారే’. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 21న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇదే సినిమాను తెలగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్‌ చేశారు. ఆగస్టు 26న విడుదలైన ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 1 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ తెలిపారు. అది కూడా క‌న్నడ వెర్షన్‌‌లో మాత్రమే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో స్ట్రీమింగ్‌పై ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే తెలుగు వెర్షన్ థియేటర్లలో ఇంక ఆడుతుండడంతో ఓ వారం ఆలస్యంగా స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

Read More: Rajinikanth: ఎంత ఎదిగిన మూలాలు మరిచిపోని రజనీకాంత్.. పిక్స్ వైరల్

Next Story

Most Viewed