సచ్చినా ఆ హీరోయిన్‌తో నటించను.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం?

by Dishanational2 |
సచ్చినా ఆ హీరోయిన్‌తో నటించను.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే అనతి కాలంలోనే పాన్ ఇండియా హీరో క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా, ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అది ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రీ సినిమా టైమ్‌లో ఆ హీరోయిన్‌తో జీవితంలో సచ్చినా నటించకూడదని నిర్ణయించుకున్నాడంట. సింహాద్రి సినిమాలో భూమిక అలాగే అంకిత ఇద్దరు హీరోయిన్స్ చేశారు. ఈ సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్న టైం లో అంకిత ఎన్టీఆర్‌ను చాలా ఇబ్బంది పెట్టిందంట. అంతే కాకుండా అవసరం లేని చోట కూడా మీద మీద పడుతూ చిరాకు తెప్పించిందంట. దీంతో అంకిత ప్రవర్తన నచ్చిని ఎన్టీఆర్ జీవితంలో తనతో అస్సలే నటించకూడదని నిర్ణయించుకున్నాడంట. ఇక ఈ విషయం తన సన్నిహితుల వద్ద చెప్పడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కొందరు దీన్ని పుకారు అని కొట్టిపారేస్తే, మరికొందరు నిజమేనేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more:

నిహారికను ఎండలో ఫ్యాన్‌గా వాడుతున్నారా?

Next Story