ఆమెతో ముద్దా.. నాకు వద్దు బాబోయ్ అంటూ షూట్ నుంచే పారిపోయిన Jr. NTR ?

by Disha Web Desk 8 |
ఆమెతో ముద్దా.. నాకు వద్దు బాబోయ్ అంటూ షూట్ నుంచే పారిపోయిన  Jr. NTR ?
X

దిశ, సినిమా :త్రిబుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రస్తుతం ఈ స్టార్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఇక నందమూరి సహాయసహకారాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన నటనతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయాడు. నిన్ను చూడాలని ఉంది అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈ హీరో తర్వాత సుబ్బు, ఆది, స్టూడెంట్ నెం.1, సింహాద్రి ఇలా చాలా సినిమాల్లో నటించి, నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

అప్పట్లో తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింన చిత్ర సింహాద్రి. ఈ మూవీ రాజమౌళి తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇండస్ట్రీలో రొమాంటిక్ సీన్స్‌లో అందరు హీరోస్ ఈజీగా నటించేస్తారు. ఇక ఇప్పుడు లిప్ టు లిప్ కిస్ చాలా కామన్ అయిపోయింది.కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రొమాంటిక్ సీన్స్ అంటే అస్సలే ఇష్టం ఉండదంట.

గతంలో రాజమౌళి దర్శకత్వం‌లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సింహాద్రి మూవీలో భూమిక‌తో లిప్ కిస్ సీన్ ప్లాన్ చేశాడంట డైరెక్టర్. అయితే ఆ విషయం ఎన్టీఆర్‌కు చెప్పడంతో, ఆవిడతో ముద్దా.. అది నావల్ల కాదు బాబోయ్ అంటూ షూట్ నుంచే పారిపోయాడంట. అప్పట్లో ఈ వార్త నెట్టింట తెగ వైరల్ కాగా, ఇప్పటికీ కూడా మన హీరో అలాంటి సీన్స్‌లో నటించను అని తెగేసి చెప్తున్నాడంట. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.


Next Story

Most Viewed