ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. డ్రాగ‌న్ నుంచి క్రేజీ న్యూస్ !

by velandi.Saikiran |

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో మళ్లీ పునః ప్రారంభం కాబోతుందట. నార్త్ యూరప్ లో భారీ యాక్షన్ సీన్స్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. డ్రాగ‌న్ నుంచి క్రేజీ న్యూస్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు దూసుకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు అన్ని ప్రపంచ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ఇక ఇటీవల దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్, అటు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో డ్రాగన్ అనే సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ నడుస్తోంది.

అయితే లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. డ్రాగన్ సినిమా షూటింగ్ ఈ నెల మూడవ వారంలో మళ్లీ పునః ప్రారంభం కాబోతుందట. నార్త్ యూరప్ లో భారీ యాక్షన్ సీన్స్ చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్కెచ్ వేశారట. దీంతో విదేశాలకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లబోతున్నారని టాలీవుడ్ స‌ర్కిల్స్ లో టాక్‌. దాదాపు రెండు నెలల పాటు ఎన్టీఆర్ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ చేస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ వాయిస్తున్నారు.

Next Story