బాలీవుడ్ హీరోకు డ్యాన్స్ నేర్పిస్తున్న Johnny Master..

by Vinod kumar |   (  Updated:2022-12-06 14:16:58  IST  )

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.

బాలీవుడ్ హీరోకు డ్యాన్స్ నేర్పిస్తున్న Johnny Master..
X

దిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు తెలుగు టాప్ హీరోస్ అయిన ఎన్‌టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు ఎన్నో సాలిడ్ మూమెంట్స్ కంపోజ్‌ చేసిన ఆయన.. ఇప్పుడు బాలీవుడ్ హీరో‌లకు తన స్టెప్స్ పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఫర్హాద్ సామ్జ్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిసి కా భాయ్ కిసి కి జాన్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా విక్టరీ వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ కొట్టేశాడు. దీంతో జానీ మాస్టర్ ఫ్యామిలీతో సహా సల్మాన్ ఖాన్‌ను కలిశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాయి.

READ MORE

Kantara Hindi OTT release date

Next Story