'This Is Me ... Now' నా భావోద్వేగ ప్రయాణం: Jennifer Lopez

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-30 17:12:58  IST  )

హాలీవుడ్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది.. Latest Telugu News

This Is Me ... Now నా భావోద్వేగ ప్రయాణం: Jennifer Lopez
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిదేళ్లుగా తనకు సంబంధించిన సొంత అల్బమ్ ఒక్కటి కూడా రిలీజ్ చేయని ఈ గాయని తాజాగా నయా మ్యూజిక్ ప్రాజెక్ట్‌ రూపొందించపోతున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. అంతేకాదు 'దిస్ ఈజ్ మి.. నౌ' అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ఆల్బమ్‌ను 2023లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

అయితే, ఈ ప్రాజెక్ట్ గత 20 ఏళ్లుగా తాను ఎదుర్కొన్న భావోద్వేగ, ఆధ్యాత్మిక, మానసిక ప్రయాణాన్ని వివరిస్తుందన్న ఆమె.. 'ఎమోషనల్ ఫీలింగ్స్‌తో ముడిపడిన నిజాయితీగల ప్రాజెక్ట్. ఇంతకు ముందు రూపొందించిన దానిలా కాకుండా నా జీవితం, అనుభవాల గురించి రాసి పాడుతున్నా. మనందరికీ ప్రతిధ్వనిస్తుంది. నా కష్టతరమైన బాల్యం, విజయవంతం కాని సంబంధాలు, ఆశ, విశ్వాసం, నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదని చాటిచెబుతుంది. ఈ స్వీయచరిత్ర కథలు ఇతర వ్యక్తిగత ప్రాజెక్టులకు దారితీస్తాయని నమ్ముతున్నా. వచ్చే ఏడాది విడుదల అవుతుంది' అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తాను ఇటీవల చేసిన అత్యంత నిజాయితీగల పని ఇదేనన్న ఆమె.. 'ది వాల్' తరహాలోనే ఈ ఆల్బమ్‌ ప్రేమతో ప్రపంచం దృష్టి ఆకర్షించాలనేది తన ఆశ అని చెప్పింది.

READ MORE

జై బాలయ్య పాటపై ట్రోల్స్.. రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..

Next Story