- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రివ్యూయర్లపై జీవిత ఫైర్.. సినిమా ఎలా తీయాలో మీరే చెప్పండి అంటూ ఘాటు వ్యాఖ్యలు
సినిమా ఎలా తీయాలో ఇప్పుడు రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోంది. సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసిపారేస్తారు.

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ యాక్షన్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో.. మూవీ టీమ్ ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న రాజశేఖర్ భార్య, నటి జీవిత రాజశేఖర్ రివ్యూయర్లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చిత్రాల రివ్యూల విషయంలో జీవిత రాజశేఖర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "సినిమా ఎలా తీయాలో ఇప్పుడు రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోంది. సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసిపారేస్తారు. అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదు అని అంటారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదు" అంటూ మండిపడ్డారు.
ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం, కోట్లాది రూపాయల ఖర్చు ఉంటుందని, రివ్యూలు చూసి కాకుండా ప్రేక్షకులు స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక మూవీ గురించి చెబుతూ.. "బతుకు జట్కాబండి వంటి షోలు చేసినప్పుడు నేను ఇలాంటి ఎన్నో రియల్ ఎమోషన్స్ చూశాను. ‘బైకర్’ సినిమాలో శర్వానంద్, రాజశేఖర్ గారు తమ కళ్లతోనే ఆ ఎమోషన్‌ను అద్భుతంగా పలికించారు. నేను థియేటర్‌లో కనురెప్ప వేయకుండా సినిమా చూశాను" అని ప్రశంసించారు. షూటింగ్ ప్రారంభం నుండి యూనిట్‌తో పాటే ప్రయాణించానని, దర్శకుడు అభి పడిన కష్టం తనకు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. చివరగా, ఎవరితోనైనా మనస్పర్థలు ఉంటే మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఎవరినీ దూరం పెట్టకుండా సంతోషంగా ఉండటమే జీవితమని ఆమె ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు.






