యాంకర్ విష్ణుప్రియతో జేడీ చక్రవర్తి వివాహం.. మా మధ్య అలాంటి బంధమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన హీరో

by Hamsa |
యాంకర్ విష్ణుప్రియతో  జేడీ చక్రవర్తి వివాహం.. మా మధ్య అలాంటి బంధమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన హీరో
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పోవే పోరా షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు షోస్‌, సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల విష్ణుప్రియ తాను హీరో జేడీ చక్రవర్తిని ఇష్టపడుతున్నానని ఛాన్స్ వస్తే ఆయనను పెళ్లి కూడా చేసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది. తాజాగా, దీనిపై జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ విష్ణు ప్రియ ఎంతో మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవల ఓ సిరీస్‌లో నటించాం. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు మేము కలిసి వర్క్ చేశాము. ఆ సిరీస్‌ దర్శకుడు పవన్‌ సాధినేని ఓ సారి విష్ణుప్రియకు చిన్న సలహా ఇచ్చాడు. ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని చెప్పాడు. అలా, నేను నటించిన సినిమాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడ్డారు. అంతే తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే ఉంది. చాలా తక్కువగా మాట్లాడుకుంటాం’’ అంటూ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Also Read: జెడి చక్రవర్తిని విషం పెట్టి చంపాలని చూసింది ఎవరో తెలుసా?

Next Story

Most Viewed