‘‘సంస్కారం మరిచి ప్రవర్తిస్తే ఊరుకోను’’.. అటిట్యూడ్ స్టార్‌కు జేడీ చక్రవర్తి స్ట్రాంగ్ వార్నింగ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-04 07:31:21  IST  )

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్(Chandrahas), తన మొదటి సినిమా 'రామ్ నగర్ బన్నీ' టైమ్ నుంచే ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.

‘‘సంస్కారం మరిచి ప్రవర్తిస్తే ఊరుకోను’’.. అటిట్యూడ్ స్టార్‌కు జేడీ చక్రవర్తి స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ, సినిమా: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్(Chandrahas), తన మొదటి సినిమా 'రామ్ నగర్ బన్నీ' టైమ్ నుంచే ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. తాజాగా ఆయన నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో చంద్రహాస్ స్టేజీపై అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న ఒక పాటను పాడారు. కుటుంబ సభ్యులు, మహిళలు ఉన్న సభలో ఒక హీరో ఇలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆ సమయంలో స్టేజీపై ఉన్న జేడీ చక్రవర్తి (JD Chakravarthy)ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఒక వీడియో వైరల్ కావడంతో జేడీని కూడా నెటిజన్లు టార్గెట్ చేశారు. అంతేకాకుండా ఆయన అలాంటి పాటను ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ ప్రమోషన్‌కి వచ్చిన ఆయన చంద్రహాస్ వల్ల వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా, ఈ విషయంపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ చంద్రహాస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

"అతడు ఆ పాట పాడుతుంటే ముందు మాకు ఏం అర్థం కాలేదు.. కానీ ఆ తర్వాత నేను, జయంత్ షాక్‌లో ఉండి ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. సింగర్ కూడానా అని షాక్ అయ్యాం. చంద్రహాస్ మల్టీ టాలెంటెడ్ గాయ్. సగం మంది మూవీ ప్రమోషన్స్‌లో అన్ని వినం. ఏదో అలా అంతా గమనిస్తున్నట్లు ఉంటాం కానీ అంతగా వినం. ఈ ప్రక్రియలోనే చంద్రహాస్ పాట పాడేటప్పుడు ఏం అర్థంకాక అందుకే తల ఊపుతున్నాను. ఎందుకంటే కోపంగా పాడుతున్నాడు..నా పక్కన ఉన్న అమ్మాయికి తెలుగు అర్థం కాక చప్పట్లు కొట్టింది. నేను కూడా అలాగే చేశానని కొందరు వీడియోలు ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు" అని జేడీ మండిపడ్డారు. తన ముందు ఎవరైనా బూతులు మాట్లాడితే అస్సలు సహించనని, గతంలో ఒక డైరెక్టర్‌ను కూడా ఇదే విషయంలో కొట్టానని జేడీ గుర్తు చేశారు. ‘‘ఇలాంటి చెత్త ప్రమోషన్లు చేస్తే సినిమాలు ఆడుతాయని అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే.

ప్రమోషన్ల కోసం సంస్కారం మరిచి ప్రవర్తించడం కరెక్ట్ కాదు’’ అని చంద్రహాస్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నేను ఈ పాట విని భరించడం అనేది పొరపాటు. నిజంగా నేను ఒప్పుకుంటున్నాను.. అది నా తప్పు. నేను బూతులు విన్నాను.. నా పక్కన అమ్మాయితో చెప్పాను. కానీ ఆ అమ్మాయికి తెలుగు రాదని చెప్పింది. దీంతో నేను అసలు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ పూజా బేడీ నన్ను పక్కకు లాగి సినిమా ఎఫెక్ట్ అవుతుందని ఆపింది. చంద్రహాస్ అలా చేయడాన్ని నేను సమర్థించను అని అన్నారు.మొత్తానికి జేడీ వివరణతో ఈ వివాదంలో ఆయన తప్పులేదని తేలిపోయినా, చంద్రహాస్ ప్రవర్తన మాత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Next Story