- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaya Prada : ఆత్మహత్యాయత్నం చేసిన జయప్రద.. ఎందుకంటే?
ఒక్కప్పుడు అంద చందాలతో అలరించిన హీరోయిన్‌లలో జయప్రద ఒకరు.

దిశ, సినిమా: ఒక్కప్పుడు అంద చందాలతో అలరించిన హీరోయిన్‌లలో జయప్రద ఒకరు. భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం కలిపి దాదాపు 300కు పైగా సినిమాలలో నటించింది. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ వంటి హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు. అయితే తాజాగా ఈ నటి వ్యక్తిగత విషయాలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
జయప్రద తన వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొందట. 1986లో జయప్రద ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే శ్రీకాంత్‌కు పెళ్లయి పిల్లలున్నారు. కానీ విడాకులు తీసుకోకుండానే జయప్రదను వివాహం చేసుకున్నాడు. అయితే శ్రీకాంత్ జయప్రదను వివాహం చేసుకున్న తర్వాత అతని మొదటి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలిసి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందట జయప్రద. వెంటనే హాస్పిటల్‌కి తరలించడంతో క్షేమంగా బయటపడిందట. కానీ ఇంత జరిగినప్పటికీ కూడా తన భర్త ఎక్కువ సమయం తన మొదటి భార్యతోనే గడిపేవాడట. మరొకవైపు పిల్లలు కలగలేదని బాధలో జయప్రద ఉండగా ఆమెకు సంబంధించి మార్కింగ్ ఫొటోలు బయటకు రావడంతో మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిందట. అలా ఎన్నో యేళ్లు తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందట.
Read More : ఆ హీరోయిన్ కారణంగానే రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందట.






