జయకృష్ణ-అజయ్ భూపతి ‘AB-4’ సినిమా టైటిల్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో అంచనాలను పెంచిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

జయకృష్ణ-అజయ్ భూపతి ‘AB-4’ సినిమా టైటిల్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో అంచనాలను పెంచిన డైరెక్టర్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో జయకృష్ణ వర్క్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా ‘AB-4’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. తాజాగా, ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ మూవీ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram)అనే పేరు పెట్టగా.. పోస్టర్‌లో తుపాకీ చేత పట్టుకొని కాలుస్తుండగా.. ఒక అమ్మాయి హీరో చేతిని పట్టుకుని కనిపించడంతో కాస్త ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ టైటిల్ పోస్టర్‌ను అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘‘ఈ ప్రేమ కథ మీ హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసి క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమా ప్రేమకథగా రాబోతుండగా.. ఇక ఇందులో జయకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భామ ఇది మొదటి సినిమా కావడం విశేషం ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతుంది. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సమాచారం. మొదటి సినిమానే యాక్షన్ ప్రయోగాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఘట్టమనేని అభిమానులు సంతోష పడుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

దీనికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. అశ్విని దత్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘట్టమనేని మూడోతరం వారసులు ఇండస్ట్రీకి రాబోతుండటంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. అజయ్ భూపతి చేసి ఆర్‌ఎక్స్-100, మంగళవారం బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక అజయ్ భూపతి, జయకృష్ణ కాంబోలో రాబోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ కూడా బాక్సాఫీసును షేక్ చేస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయిందనడంలో అతిశయోక్తి లేదు.

link

Next Story