‘జటాధర’ టీజర్ రిలీజ్.. పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి భయబ్రాంతులకు గురి చేస్తున్న స్టార్ బ్యూటీ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-08 06:29:24  IST  )

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu)నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జటాధర’(Jatadhara).

‘జటాధర’ టీజర్ రిలీజ్.. పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి భయబ్రాంతులకు గురి చేస్తున్న స్టార్ బ్యూటీ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu)నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జటాధర’(Jatadhara). ఈ సినిమాకు వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) కీలక పాత్రలో కనిపించనుంది. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ‘జటాధర’ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం.. ‘జటాధర’ టీజర్ విడుదల చేశారు. ఇక ఇందులో ఓ భూత్ బంగ్లా చూపించగా.. అందులో సోనాక్షి సిన్హా బంగారు ఆభరణాలతో పవర్ ఫుల్ లుక్‌లో కనిపించగా.. సాధారణమైన మనిషి అయిన సుధీర్ బాబుతో కలబడుతోంది. ఇందులో ఈ అమ్మడు విలన్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డిఫరెంట్ లుక్స్‌తో ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అమ్మడు లక్స్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘జటాధర’ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Next Story