‘జటాధర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీకటి లోతుల్లోంచే దైవత్వం పుట్టుకొస్తుందంటూ హైప్ పెంచుతోన్న ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu), వెంకటేష్ కళ్యాణ్(Venkatesh Kalyan), అభిషేక్ జైస్వాల్ రాబోతున్న మూవీ ‘జటాధర’.

‘జటాధర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీకటి లోతుల్లోంచే దైవత్వం పుట్టుకొస్తుందంటూ హైప్ పెంచుతోన్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu), వెంకటేష్ కళ్యాణ్(Venkatesh Kalyan), అభిషేక్ జైస్వాల్ రాబోతున్న మూవీ ‘జటాధర’. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ‘జటాధర’ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ‘జటాధర’ ఈ ఏడాది నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. చీకటి లోతుల్లోంచే దైవత్వం పుట్టుకొస్తుందంటూ ఓ పవర్ ఫుల్ త్రిశూలం, దేవుని పాదాలు షేర్ చేశారు. ఈ విషయంపై నిర్మాత మాట్లాడుతూ.. ‘‘జీ స్టూడియోస్‌తో రుస్తుం విజయం తర్వాత, ‘జటాధార’ ద్వారా తిరిగి రావడం పట్ల గర్వపడుతున్నాను. నేను నిజంగా కృతజ్ఞుడను. ఈ చిత్రం మన సాంస్కృతిక నైతికతను ప్రపంచ సినిమాటిక్ స్కేల్‌తో మిళితం చేసే లోతుగా పాతుకుపోయిన కథతో రూపొందించబడింది. మా దృష్టి, మా అద్భుతమైన బృందంతో, మేము ప్రేక్షకులకు అరుదైన అనుభవాన్ని అందించబోతున్నాం. ఇది భావోద్వేగపరంగా శక్తివంతమైనది, దృశ్యపరంగా మరపురానిదిగా ఉండబోతుంది’’ అని చెప్పుకొచ్చారు.

link

Next Story