తండ్రి బాటలోనే జాసన్ సంజయ్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్?

by Mallepaka Hamsa |

జాసన్ సంజయ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. డైరెక్షన్ చేస్తున్న సంజయ్, ఇప్పుడు హీరోగా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

తండ్రి బాటలోనే  జాసన్ సంజయ్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అంతా ఆయన హీరోగా వస్తాడనుకుంటే.. దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’ అనే యాక్షన్ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో సందీప్ కిషన్ సరసన 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో, తాజాగా జాసన్ సంజయ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. డైరెక్షన్ చేస్తున్న సంజయ్, ఇప్పుడు హీరోగా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు అభిషన్ జీవింత్, అశ్వత్ మరిముత్తుల బాటలోనే ఆయన కూడా నడవాలని భావిస్తున్నారట. వీరిద్దరు దర్శకత్వం తర్వాత హీరోలుగా వెండితెరపైకి వచ్చారు. ఇక జాసన్ కూడా త్వరలోనే హీరోగా ఒక క్రేజీ సినిమా చేయబోతున్నట్లు టాక్. ఈ మూవీని ఒక పాపులర్ డైరెక్టర్ తెరకెక్కించబోతుండగా, 'పరిమళం అండ్ కో' నిర్మాత కుమారన్ ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా ముగిశాయని, సంజయ్ హీరోగా చేయబోయే ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట. మొత్తానికి అటు దర్శకుడిగా తన మొదటి సినిమా ‘సిగ్మా’ విడుదలకు సిద్ధమవుతుండగానే, ఇటు హీరోగా మారేందుకు సంజయ్ అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తండ్రి బాటలోనే నడుస్తూ.. స్టార్ హీరోగా మారతాడని అభిప్రాయపడుతున్నారు.

Next Story