ఆ అలవాటు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడలేము: Jasmin Bhasin

by Kodari Anjali |   (  Updated:2023-04-11 13:01:22  IST  )

యంగ్ బ్యూటీ జాస్మిన్ భాసిన్ సినీ ఇండస్ట్రీ కల్చర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆ అలవాటు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడలేము: Jasmin Bhasin
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ జాస్మిన్ భాసిన్ సినీ ఇండస్ట్రీ కల్చర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ సమావేశంలో పాల్గొ్న్న బ్యూటీ.. మొదటి నుంచి సరైన దృక్పథం లేకపోతే పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండలేమని చెప్పింది. ‘మీరు హై టాలెంటెడ్ పర్సన్ కావొచ్చు.. మీ అందానికి కొదవలేకపోవచ్చు.. కానీ, సరైన యాటిట్యూడ్ లేకపోతే ఇక్కడ నిలదొక్కుకోలేరు. నేను ఇక్కడ స్థానం సంపాదించడానికి చాలా కాలం పట్టింది. అయినప్పటికీ పెద్ద ప్రాజెక్ట్‌ల కోసం ఇంకా ఎదురుచూస్తున్నా. ఒక్క పెద్ద సినిమాతో నన్ను నేను నిరూపించుకుని, వెలిగిపోవాలని ఆశిస్తున్నా’ అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

అనన్య లవ్ ఎఫైర్.. చిరాకుగా ఉందన్న తల్లి


Next Story