- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్పెషల్ ప్లేస్‌లోనే పెళ్లి చేసుకుంటా.. ముగ్గురు పిల్లలను కనాలని ఉందంటూ జాన్వీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఊహించని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఊహించని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తోంది. బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar), దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్, ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది.
అయితే ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ఇందులో 1000మంది రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పెళ్లి, పిల్లలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నా పెళ్లి చెన్నైలోని మా అమ్మ పూర్వికుల ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాను. వివాహం తర్వాత నా భర్తతో తిరుపతిలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. నా లక్కీ నెంబర్ 3. అందుకే పెళ్లి తర్వాత నాకు ముగ్గురు పిల్లలను కనాలని ఉంది. వారిలో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ ఎవరికి సపోర్ట్ చేస్తారో నేను చూడాలి.
అలాగే నా మూడో బిడ్డ శాంతిని నెలకొల్పోవాడవుతాడవ్వాలని అనుకుంటున్నా. సందర్భాన్ని బట్టి వాళ్ల మద్దతు మారుతూ ఉంటుంది. ఇలా నా బిడ్డలందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు’’ అని చెప్పుకొచ్చింది. కానీ పెళ్లి ఎప్పుడనేది రివీల్ చేయలేదు. కాగా.. గత కొద్ది కాలంగా జాన్వీ కపూర్, మాజీ సీఎం మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిత్యం వీరిద్దరు పలుచోట్ల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. అయినప్పటికీ ఈ వార్తలను జాన్వీ పట్టించుకోవడం లేదు.






