వివాదంలో జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ.. ఆమె అంత కష్టంగా ప్రయత్నించడం ఎందుకంటూ నటి ఫైర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari).

వివాదంలో జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ మూవీ.. ఆమె అంత కష్టంగా ప్రయత్నించడం ఎందుకంటూ నటి ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari). తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేయడంతో అది కాస్త వివాదంలో చిక్కుకుంది. తాజాగా, ‘పరమ్ సుందరి’ ట్రైలర్‌పై మలయాళ నటి పవిత్ర మీనన్ ఫైర్ అయింది.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను కూడా షేర్ చేసింది. కేరళ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాల్లో మలయాళ నటులను తీసుకోవాలని హెచ్చిరించింది. ‘‘నేను ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశాను. కేరళ అమ్మాయిగా జాన్వీ కపూర్ పాత్రలో నటించింది. ఇలాంటి రోల్ కోసం మలయాళ హీరోయిన్‌ను తీసుకుంటే ఏమైంది. అసలు మలయాళ వాళ్లతో మీకేంటి సమస్య. మాకు టాలెంట్ లేదనుకుంటున్నారా. కేరళలో అయితే ఇలా జరగదు. నేను హిందీతో పాటు మలయాళం కూడా స్పష్టంగా మాట్లాడగలను. హిందీ సినిమాలో మలయాళ హీరోయిన్ దొరకడం అంత కష్టంగా మారిందా? అనిపిస్తుంది.

1990లో మలయాళ చిత్రాల్లో పంజాబీలను చూపించాల్సిన పాత్రలో వాళ్లకి అవకాశం ఇచ్చాము. మేము మల్లెపూలు ధరించడం లేదు. ప్రతిచోటా మోహినియాట్టం కూడా చేస్తాము. జాన్వీ అంటే నాకు ద్వేషం లేదు. కానీ ఆమె అంత కష్టంగా మలయాళ భాషను ప్రయత్నించడం ఎందుకోనాకు అర్థం కావడం లేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Next Story