- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ పెళ్లి.. అలాంటి పోస్ట్‌తో హింట్ ఇచ్చేశాడుగా!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ‘దేవర’ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి ప్రాజెక్ట్ తోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన అందం, నటనతో ఎనలేని క్రేజ్ రాబట్టుకుని యూత్‌ను కట్టిపడేసింది. ఇక ఇటీవల ‘పరం సుందరి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో జాన్వీ రొమాన్స్ చేయనుంది. ఇది ఆమెకు తెలుగులో రెండు ప్రాజెక్ట్ కావడం విశేషం. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో పాటు జాన్వీ హిందీలో ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ లోనూ నటిస్తోంది.
ఇక జాన్వీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ పాడే మనవడు శిఖర్ పహారియా(Shikhar Pahariya)తో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే వీరిద్దరు పలుచోట్ల చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో శిఖర్, జాన్వీ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కలిసి ఎలాంటి సినిమా చేయకపోయినా సన్నిహితంగా ఉంటుండటంతో నిత్యం ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. అయినప్పటికీ వాటిపై వీరిద్దరు స్పందించలేదు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, శిఖర్ పహారియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జాన్వీతో రిలేషన్‌షిప్‌పై హింట్ ఇచ్చాడు. ‘పరం సుందరి’ మూవీలో జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా కలల రాణి జాన్వీ వావ్ సూపర్’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అలాగే ‘పరం సుందరి’ లోని జాన్వీ లుక్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శిఖర్ ఈ పోస్ట్‌తో పెళ్లిపై హింట్ ఇచ్చాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించబోతున్నట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ శిఖర్ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.






