- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడితో జాన్వీ కపూర్ పెళ్లి.. ఎట్టకేలకు స్పందించి అసలు విషయాన్ని రివీల్ చేసిన బోనీ కపూర్
వీరి పెళ్లికి సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త శిఖర్ పహారియాల ప్రేమ వ్యవహారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, వారు కలిసి వెళ్తున్న విహారయాత్రలు, ఆలయ సందర్శనలు సోషల్ మీడియా పోస్ట్‌లు వారు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాన్వీ కపూర్- శిఖర్ పహారియా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, ముఖ్యంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. మరికొందరు మాత్రం తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో సెప్టెంబర్‌లో ఈ పెళ్లి జరుగుతుందని ప్రచారం చేశారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. "అందులో ఏమాత్రం నిజం లేదు" అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో జాన్వీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇక జాన్వీ.. శిఖర్ పహారియా గురించి మాట్లాడుతూ జాన్వీ ఎప్పుడూ ఎమోషనల్ అవుతుంటారు. ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ, "శిఖర్ తోడు నాకు ఎంతో భద్రతను ఇస్తుంది. నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా, అతని ఉనికి నన్ను ధైర్యంగా ఉంచుతుంది. ఇప్పుడు నేను గతంలోలా నిస్సహాయంగా ఫీల్ అవ్వడం లేదు" అని చెప్పారు. కపూర్ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్‌లోనూ శిఖర్ కనిపిస్తూ అందరిలో ఒకరిగా కలిసిపోయారు.వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, వృత్తిపరంగా జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2026 జూన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం జాన్వీ తన దృష్టి అంతా సినిమాలపైనే పెట్టినట్లు అర్థమవుతోంది.






