- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా నిశ్శబ్దాన్ని కూడా అతను అర్థం చేసుకున్నాడు.. అర్ష్ తో బంధంపై మెహ్రీన్ ఎమోషనల్ కామెంట్స్
మొదట కలిసినప్పుడు మా మధ్య పెద్దగా అంచనాలు లేవు. ఒక అరగంటలో మీటింగ్ అయిపోతుందని అనుకున్నాం. కానీ ఆ మాటలు ఏకంగా ఆరు గంటల పాటు సాగాయి. ఆ రోజే మా మనసులు కలిశాయి.

దిశ, సినిమా: ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ ఫేమ్ మెహ్రీన్ పిర్జాదా తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఎలాంటి హడావుడి లేకుండా, అత్యంత గోప్యంగా వ్యాపారవేత్త అర్ష్ ఔలఖ్‌ను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో పంచుకునే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం. తన ప్రేమ, పెళ్లి విశేషాలను మెహ్రీన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వీరిద్దరి పరిచయం ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా జరిగినట్లు తెలుపుతూ... "మొదట కలిసినప్పుడు మా మధ్య పెద్దగా అంచనాలు లేవు. ఒక అరగంటలో మీటింగ్ అయిపోతుందని అనుకున్నాం. కానీ ఆ మాటలు ఏకంగా ఆరు గంటల పాటు సాగాయి. ఆ రోజే మా మనసులు కలిశాయి. ఒకరినొకరు ఇష్టపడ్డాం" అని మెహ్రీన్ తెలిపారు. గతేడాది జూలైలో మొదలైన వీరి బంధాన్ని కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఉంచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అర్ష్ ఇప్పటివరకు మెహ్రీన్ నటించిన ఏ సినిమాను కూడా చూడలేదట. మెహ్రీన్ తన అన్నయ్య, నటుడు గుర్ ఫతే పిర్జాదా గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. "చాలామంది అమ్మాయిలకు తండ్రి రోల్ మోడల్, కానీ నాకు నా అన్నయ్యే అంతా.
నా పెళ్లి విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అర్ష్ గురించి లోతుగా ఆరా తీశారు. కానీ ఒక్కసారి వారిద్దరూ కలిశాక అన్నదమ్ముల్లా కలిసిపోయారు" అని చెప్పారు. పెళ్లి సమయంలో గుర్ ఫతే చిన్నపిల్లాడిలా ఏడ్చాడని, అది చూసి అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయని ఆమె గుర్తు చేసుకున్నారు. మెహ్రీన్ తన పెళ్లి కోసం ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఆమె ధరించిన వివాహ వస్త్రాలు తన తల్లి పెళ్లి నాటి దుస్తులను రీ-డిజైన్ చేయించుకున్నట్లు.. అలాగే తన చేతి ఆభరణాలు అమ్మ, అన్నయ్య సందేశాలు, కుటుంబ సభ్యుల ఫోటోలు, తాతయ్య-అమ్మమ్మల గుర్తులు ఉండేలా జాగ్రత్త పడ్డానని ఎమోషనల్ అయింది. పెళ్లి గురించి ముందుగా ప్రకటించి దానిని ఒక ఈవెంట్‌లా మార్చడం మెహ్రీన్‌కు ఇష్టం లేదట. అందుకే పీఆర్ టీమ్‌ను కూడా నియమించుకోలేదని, ఫోటోగ్రాఫర్లు, ఇతర వెండర్లు కూడా ఈ విషయాన్ని బయటపెట్టకుండా జాగ్రత్త పడ్డారని ఆమె తెలిపారు. పెళ్లి తర్వాత ఇప్పుడు ఆఫ్రికాకు హనీమూన్ వెళ్లనున్నట్లు, తిరిగి వచ్చాక మళ్ళీ తన నటనా జీవితాన్ని కొనసాగిస్తానని మెహ్రీన్ స్పష్టం చేశారు. పెళ్లి తర్వాతే తన కెరీర్‌లో అసలైన బిజీ ఫేజ్ మొదలవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






