ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో జాన్వీ కపూర్ సినిమా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నిర్మాత

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-17 06:44:09  IST  )

అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ 2026లో ‘హోమ్‌బౌండ్’(Homebound) సినిమా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో జాన్వీ కపూర్ సినిమా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నిర్మాత
X

దిశ, సినిమా: అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ 2026లో ‘హోమ్‌బౌండ్’(Homebound) సినిమా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో భారత్ తరపున సెలెక్ట్ అయిన ఈ చిత్రం ఆస్కార్ ఎంపికలో కీలకమైన షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. అయితేఈ ఏడాది ఆస్కార్‌ పోటీకి ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల నుంచి సినిమాలు ఎంట్రీలు పంపగా.. కేవలం 15 చిత్రాలను మాత్రమే తదుపరి దశకు ఎంపిక చేశారు. ఇందులో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ‘హోమ్‌బౌండ్’ నిలవడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

తాజాగా, ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆస్కార్‌లో తమ సినిమా ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘‘హోమ్‌బౌండ్ ప్రయాణం పట్ల నేను ఎంత గర్వంగా, ఆనందంగా, ఉప్పొంగిపోతున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ధర్మా మూవీస్‌లో మేమందరం ఈ గర్వించదగ్గ, ముఖ్యమైన చిత్రాన్ని మా ఫిల్మో గ్రఫీలో కలిగి ఉన్నందుకు చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం.

మా కలలు చాలా వరకు నిజం చేసినందుకు నీరజ్ ఘైవాన్‌కు ధన్యవాదాలు... కేన్స్ నుండి ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌ వరకు, ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రత్యేకమైన చిత్రంలోని నటీనటులు, సిబ్బంది, బృందాలందరికీ నా ప్రేమలు! ముందుకు సాగిపోదాం... హోమ్‌బౌండ్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది’’ అని రాసుకొచ్చారు. కాగా.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఇషాన్ కట్టర్ కాంబోలో వచ్చిన ‘హోమ్‌బౌండ్’ విజయం సాధించింది. మత, వివక్షకు వ్యతిరేకంగా ఇద్దరు స్నేహితులు చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డులు క్రియేట్ చేసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ‘హోమ్‌బౌండ్’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

Read More... ఆస్పత్రి బెడ్ పై టీమిండియా క్రికెటర్.. ఫోటో వైరల్

Next Story