- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘పెద్ది’ టీమ్
జాన్వీ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జాన్వీ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే మాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. విడుదలైన పోస్టర్ వీడియోలో జాన్వీ లుక్ చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది. ఆమె ఆహార్యం, చూపులు ఈ పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో స్పష్టం చేస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తన ట్వీట్‌లో జాన్వీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘నీతో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
స్క్రీన్ మీద అచ్చియమ్మగా నీ పవర్ ఫుల్ అవతారాన్ని ప్రపంచం చూడబోతున్నందుకు నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తుండటంతో ఈ పెయిర్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కేవలం చరణ్, జాన్వీ మాత్రమే కాకుండా.. సీనియర్ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మరియు దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. జాన్వీ కపూర్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి పూర్తిస్థాయి పల్లెటూరి మాస్ క్యారెక్టర్ ఇదే కావడంతో, ‘అచ్చియమ్మ’గా ఆమె ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






