పెళ్లి కాకుండానే శుభవార్త చెప్పబోతున్న జాన్వీ కపూర్?.. పుల్ల మామిడికాయ ముక్కలు తింటూ (వీడియో)

by Disha Web Desk 6 |
పెళ్లి కాకుండానే శుభవార్త చెప్పబోతున్న జాన్వీ కపూర్?.. పుల్ల మామిడికాయ ముక్కలు తింటూ (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లోనే ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు హిందీ సినిమాల్లోనే నటించినప్పటికీ తెలుగులోనే మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరో ఎన్టీఆర్ దేవరతో జాన్వీ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవబోతుంది. సినిమా విడుదల కానప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. అంతేకాకుండా ఆమె రామ్ చరణ్ RC16లోనూ ఆఫర్ అందుకుంది. ఇక ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్ అయితే మాత్రం జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీలోనే కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే జాన్వీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడంతో పాటుగా అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా, జాన్వీ తన పుట్టినరోజు కావడంతో ప్రియుడు శిఖర్‌తో పాటు తన కుటుంబ సభ్యులను తీసుకుని తిరుపతికి వెళ్లింది. మోకాళ్లపై మెట్లు ఎక్కి మరీ పూజలు చేసింది. అంతేకాకుండా కాకుండా అక్కడ పుల్లటి మామిడికాయ ముక్కలు కొనుకుని తిన్నారు. జాన్వీ తింటుండగా.. ఆమె చేతిలోంచి ఆమె ప్రియుడు శిఖర్ లాక్కుని మరీ తిన్నాడు.

అయితే ఇదంతా వీడియో తీసి జాన్వీ ఫ్రెండ్ ఒర్రి తన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాడు. ప్రస్తుతం జాన్వీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అవి చూసిన వారంతా రకరకాలుగా అనుకుంటున్నారు. పెళ్లి కాకుండానే జాన్వీ పుల్లటి మామిడికాయ తింటుందంటే శుభవార్త చెప్తుందేమో? అని చర్చించుకుంటున్నారు. కానీ జాన్వీతో పాటు కుటుంబ సభ్యులంతా అదంతా సరదాగా తిన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed