- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ మూవీస్‌కి రెమ్యూనేషన్‍ను భారీగా పెంచేసిన జాన్వీ కపూర్..ఎంతంటే?
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా హిందీ చిత్ర సీమకు పరిచయమైంది

దిశ, సినిమా: శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. మొదటి మూవీ తోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ లో మరింత పాపులారిటి దక్కించుకుంది. ఇక తాజాగా టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్న ఈ చిన్నది ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో పాటుగా మెగాహీరో రామ్‍చరణ్ హీరోగా నటించనున్న స్పోర్ట్స్ బ్యాక్‍డ్రాప్ మూవీ (RC16)లోనూ జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నట్లు సమాచారం.
అయితే తాజాగా జాన్వీ నటిస్తున్న ఈ రెండు తెలుగు సినిమాలకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఏంటీ అంటే ‘దేవర’ సినిమా కోసం జాన్వీ కపూర్ రూ.5కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‍చరణ్ చేయనున్న మూవీ (RC16) కోసం జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. కాగా ఈ చిత్రం కోసం జాన్వీ రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.
- Tags
- janhvi kapoor






