- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి రోజూ అదే పని చేస్తా.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ జాన్వీ కపూర్ షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor )తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor )తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి’(Param Sundari)తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) హీరోగా నటిస్తున్నారు. ఇందులో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుండగా.. ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఇందులో రెంజీ పనికర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈక్రమంలో.. జాన్వీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు జాన్వీకపూర్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లింది.
అక్కడ కర్రతో కాకుండా కొబ్బరికాయతో ఉట్టికొట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ అమ్మడు ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం చెప్పింది. దీంతో ఈ వీడియోలు కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఓ నెటిజన్ ‘‘బాలీవుడ్ సెలబ్రిటీలందరూ దయచేసి హిందూ పండుగ వేడుకలను నాశనం చేయవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. కనీసం సినిమాలను ప్రోత్సహించే ముందు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి.” అని పోస్ట్ పెట్టాడు. అలాగే పలువురు నెటిజన్లు జాన్వీ గురించి దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, జాన్వీ కపూర్ ఈ ట్రోల్స్‌పై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయింది. ‘‘ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా ముందుగా ‘భారత్ మాతాకీ జై’ అని అన్నారు. ఆ తర్వాతే నేను అన్నాను. కానీ కొంతమంది వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయినా దేశాన్ని పొగడడానికి ఒక రోజంటూ ప్రత్యేకంగా ఉండదు కదా. జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. నేను ప్రతిరోజు ‘భారత్ మాతాకీ జై’ అంటాను. ఏం చేస్తారో చేసుకోండి’’ అని రాసుకొచ్చింది. అలాగే పూర్తి వీడియోను చూడాలంటూ దానిని కూడా షేర్ చేసింది. దీంతో ట్రోల్స్ చెక్ పడినట్లు అయింది.






