టాలీవుడ్‌ను ఏలేస్తున్న జాన్వీ కపూర్.. స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-13 10:36:49  IST  )

జాన్వీ, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్‌ను ఏలేస్తున్న జాన్వీ కపూర్.. స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ, తన గ్లామర్, నటనతో ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉన్న జాన్వీ, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘రాకా’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ జాన్వీ ఇక్కడి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది.

దర్శకుడు అట్లీ తన సినిమాల్లో కథకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, హీరోయిన్ల పాత్రలను కూడా అంతే పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారు. ‘రాకా’ సినిమాలో ఏకంగా నలుగురు స్టార్ భామలకు చోటు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా దీపికా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ , రష్మిక మందన్న, జానీ కీలక పాత్రలో కనిపించనున్నారట. సాధారణంగా పరభాషా హీరోయిన్లు ఒకటో రెండో సినిమాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం టాలీవుడ్‌ను తన అడ్డాగా మార్చుకుంటోంది. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇప్పుడు అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌గా మారడం ఖాయమనిపిస్తోంది.కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

Next Story