ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంపై స్పందించిన జాన్వీ కపూర్.. అసలు నిజాలు రివీల్

by Mallepaka Hamsa |

అందం కోసం హీరో, హీరోయిన్లే కాకుండా సాధారణంగా ప్రజలు కూడా పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంపై స్పందించిన జాన్వీ కపూర్.. అసలు నిజాలు రివీల్
X

దిశ, సినిమా: అందం కోసం హీరో, హీరోయిన్లే కాకుండా సాధారణంగా ప్రజలు కూడా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లడం పలు విధాల ప్రయత్నాలు చేస్తూ అందంగా మారిపోతున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. ఇండస్ట్రీలో రాణించేందుకు ఎంతకైనా తెలగించేస్తారు. కొందరు గ్లామన్ డోస్‌తో పాపులారిటీ దక్కించుకుంటే.. మరికొందరు మాత్రం తమ అందంతోనే మంత్రముగ్దులను చేస్తుంటారు. ఇంకా కొందరైతే.. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని తమ బాడీలో సరిగ్గా లేని భాగాన్ని సరి చేసుకుంటుంటారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా వచ్చిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor )కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్ ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’(Too Much with Kajol and Twinkle) టాక్ షోలో పాల్గొని క్లారిటీ ఇచ్చింది. ‘‘నా ప్రతి నిర్ణయం వెనుక మా అమ్మ సలహా ఉంది.

ఆమె అనుభవం వల్ల నేను తప్పులు చేయకుండా ఉంటున్నాను. యువతులు సోషల్ మీడియాలో చూసిన దాన్ని బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ఎవరో చేసినట్లు మనం సర్జరీ చేయించుకోవాలని అనుకోవడం ప్రమాదకరం. అందుకే పారదర్శకత చాలా ముఖ్యం. ఎవరో డాక్టర్‌లుగా నటిస్తూ, ఒక నటికి చేసిన సర్జరీల లిస్ట్ చూపిస్తూ వీడియోలు చేస్తారు. అలా నా ఫొటో పెట్టి బఫెలో ప్లాస్టీ చేసుకుందట అని చెప్పారు. అది చూసిన నేను షాక్ అయ్యా. అలాంటి తప్పుడు సమాచారం విని ఎవరైనా యువతి ప్రయత్నించి ఏదైనా తప్పు జరిగితే, అది భయంకరమైన విషయం యువతులు తమ శరీరాన్ని ప్రేమించాలి. మనం మనల్ని అంగీకరించడం సిగ్గు కాదు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు మన మనసును ప్రభావితం చేయొద్దు. ప్రతి ఒక్కరికీ అందం అంటే వేరు. ఎవరు చెప్పిన స్టాండర్డ్స్‌కి లోబడవద్దు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story