Janhvi Kapoor: పెళ్లి చేసుకోబోతున్న జాన్వీ కపూర్.. మంగళ స్నానాలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసి బిగ్ షాకిచ్చిందిగా!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

Janhvi Kapoor: పెళ్లి చేసుకోబోతున్న జాన్వీ కపూర్.. మంగళ స్నానాలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసి బిగ్ షాకిచ్చిందిగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఫుల్ పాపులారిటీతో ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన మొదటి ప్రాజెక్ట్ ‘దేవర’(devara)లో హీరోయిన్‌గా నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలుగులో ఒక్క సినిమాతోనే క్రేజీ బ్యూటీగా మారిన జాన్వీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ (peddi)లో లక్కీ చాన్స్ అందుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో జాన్వీ రేంజ్ మారిపోతుందనే టాక్ కూడా ఉంది.

దీంతో పాటు జాన్వీ హిందీలో ‘పరం సుందరి’లో సిద్ధార్థ్ మాల్హోత్రా(Siddharth Malhotra)తో రొమాన్స్ చేయనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్‌పై ఆమె ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్ మంగళ స్నానాలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. దీంతో అవి చూసిన నెటిజన్లు ఆమె పెళ్లి చేసుకోబోతుందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి బిగ్ షాకిచ్చిందని అంటున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం అవి ఏదైనా సినిమాకు సంబంధించిన స్టిల్స్ కావచ్చని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జాన్వీకి సంబంధించిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Next Story