Instagram ద్వారా Janhvi Kapoor ఆదాయం ఎంతో తెలుసా?

by Harish |   (  Updated:2022-11-11 16:38:07  IST  )

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తరచూ అభిమానుల చర్చల్లో ఉండాలనుకున్నట్లుగా..Latest Telugu News

Instagram ద్వారా Janhvi Kapoor  ఆదాయం ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తరచూ అభిమానుల చర్చల్లో ఉండాలనుకున్నట్లుగా.. ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫోటో షూట్‌లతో అలరిస్తుంటుంది. అలా గ్లామర్ షోతోనే ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 20.5 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమెకున్న ఫాలోయింగ్‌ను బట్టి సదరు బ్రాండ్ నిర్వాహకులు సైతం జాన్వీకి ఎంత మొత్తం అయిన ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

పలు టాప్ బ్రాండ్స్‌ను ఆమెను అప్రోచ్ అవుతుండగా.. సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటుంది. ఇలాంటి ఒక్కో పోస్ట్‌కు ఆమె రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు చార్జ్ చేస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తద్వారా వచ్చే డబ్బును ఆమె ఈఎంఐలు చెల్లించేందుకు ఉపయోగిస్తుందని చెప్పింది.

ఇంకా అందంగా, క్యూట్‌గా ఉంటే.. ప్రజలు తనను ఆదరిస్తారని, ఫాలోయింగ్ మరింత పెరుగుతుందని, అలాగే ప్రమోటింగ్ ఆఫర్స్ కూడా ఆటోమేటిక్‌‌గా పెరిగిపోతాయని చెప్పుకొచ్చింది.

Also Read : మన నాయకులకు ప్రజల బాధలు పట్టవు: ఈషా

Next Story