- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్ కన్ఫామ్.. మాకొద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో RC16 అనే సినిమా రాబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో జరుగుతున్నట్లు రామ్ చరణ్ నటించాలనుకునే వారు ఆడిషన్‌కు రావాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. RC16 గురించి రోజు రోజుకు మరింత హైప్ పెరిగేలా పలు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇటీవల రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేసింది.
ఈ క్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చాడు. తొందరలో జాన్వీ కపూర్ రామ్ చరణ్‌తో సినిమా చేయబోతుంది. ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అది చూసిన మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ వద్దు అంత నచ్చితే ఐటెం సాంగ్‌లో పెట్టుకో మాకొద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#JanhviKapoor Roped in for #RC16 as Female Lead - Confirms @BoneyKapoor !!@AlwaysRamCharan @BuchiBabuSana @arrahman pic.twitter.com/aotWNH9tOT
— Trends RamCharan ™ (@TweetRamCharan) February 18, 2024