- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: అందరికీ ఫ్యామిలీ హీరోగా పరిచయం అయ్యారు జగపతి బాబు. ఫ్యామిలీ హీరోగా మంచి ఆదరణ అందుకున్నా ఆ తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గాయి. దాదాపు జగపతి బాబును ప్రేక్షకులు మరిచిపోతున్నారా..? అన్న సమయంలో 'లెజెండ్' సినిమాతో లెజెండ్రీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన రీతిలో నెగిటివ్ పాత్రలతోనూ అందరిని ఔరా అనిపించారు. తనదైన నటన, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ అందుకున్నారు. అయితే ఫిబ్రవరి 12 జగపతి పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం అంటే ఫిబ్రవరి 11 జగ్గూభాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన అవయవ దానం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సందర్భంగా తన అవయవ దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాటలు అందరినీ కదిలించాయి. 'మనుషులగానే పుడతాం.. చనిపోతాం. చనిపోయేటప్పుడు 200 గ్రాముల బూడిద తప్ప మరేమీ తీసుకెళ్లం. అదే మన అవయవాలు ఇస్తే మరొకరికి పునర్జన్మనిచ్చినట్లే. అవయవ దానం తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా కొందరిని బ్రతికించగలుగుతాం' అని అన్నారు. అయితే దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అవయవ దానం చేసిన కొద్దమంది సెలబ్రిటీల్లో జగపతి బాబు కూడా చేరారు. హీరో నవదీప్, సమంత, రాజమౌళి ఇప్పటివరకు తమ అవయవదానం చేయనున్నట్లు తెలిపారు.






