వాచ్ మెన్ కొడుకును చదివిస్తున్న జబర్దస్త్ వర్ష

by Disha Web Desk 10 |
వాచ్ మెన్ కొడుకును చదివిస్తున్న జబర్దస్త్ వర్ష
X

దిశ, సినిమా: జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ దక్కించుకున్న వర్ష.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ట్రెండీ డ్రెస్సింగ్‌‌లో కనిపిస్తూ హాట్ హాట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. మంచి అవకాశం రావాలి కానీ ఎలాంటి పాత్ర చేయడానికైనా.. ఎంత బోల్డ్‌‌గా నటించడానికైనా సిద్ధమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది కూడా. అయితే ఇప్పటి వరకు వర్ష గ్లామర్‌ని చూసి మురిసిపోయిన అభిమానులు.. ఆమెలోని సేవాగుణం గురించి తెలుసుకుని ప్రశంసలు కురిపిస్తున్నారు. తన వాచ్‌మెన్‌కు ఇద్దరు కొడుకులుండగా.. అతనికి ఇద్దరిని చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఒకరిని తానే చదివిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ఎంత ఖర్చయినా సరే ఆ అబ్బాయి చదువు పూర్తయ్యే వరకు తనే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపింది.

Jabardasth Varsha : వహ్ వర్ష.. చీరకట్టులో కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న జబర్దస్త్ భామ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed