'బిగ్ బాస్' హౌస్‌లోకి సుడిగాలి సుధీర్?

by Dishanational4 |
బిగ్ బాస్ హౌస్‌లోకి సుడిగాలి సుధీర్?
X

దిశ,సినిమా: తెలుగు టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షో‌గా పాపులారిటీ దక్కించుకుంది 'బిగ్ బాస్'. ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న 'బిగ్ బాస్' తెలుగు ప్రజెంట్ ఆరో సీజన్ సెప్టెంబర్ 4న మొదలైంది. కానీ ముందు సీజన్‌లతో పోలిస్తే టీఆర్పీ పరంగా మాత్రం డీలా పడినట్లు సమాచారం. దీంతో కంటెస్టెంట్‌లకు నాగార్జున గట్టి క్లాస్ పీకడం‌తో వారి ఆట తీరు కాస్త మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో షో‌కి మరింత వైభవం తీసుకురావడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సుడిగాలి సుధీర్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుపుతున్నారట. ఆయనతో చర్చలు నడుపుతున్నట్లు టాక్ వినిపిస్తుండగా.. సుధీర్‌కి జనాల్లో ఉన్న పాపులారిటీ‌‌ని బట్టి రోజుకు లక్ష రూపాయల వరకు పారితోషికం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed