- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా కొత్తగా ఉంటుంది.. ఖచ్చితంగా ‘సైక్ సిద్ధార్థ’ మీ అందరికీ నచ్చుతుంది..
యంగ్ హీరో శ్రీ నందు (Sri Nandu)తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'(Psych Siddhartha).

దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీ నందు (Sri Nandu)తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'(Psych Siddhartha). రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి (Varun Reddy)దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాని డైరెక్టర్ వరుణ్ చాలా డిఫరెంట్ ప్రజెంట్ చేశాడు. టికెట్ రేట్స్ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఈ సినిమా టికెట్ కేవలం 99 రూపాయలు మాత్రమే. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ అన్నారు. అనంతరం హీరో శ్రీ నందు మాట్లాడుతూ... 2026 తెలుగు సినిమా సైక్ సిద్ధార్థ తో ప్రారంభం కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది నీ ఒక మంచి సక్సెస్ తోనే ముగించినందుకు చాలా ఆనందంగా ఉంది. 2025 నాకు చాలా మంచి ఇయర్ దండోరా హిట్ అయింది. అలాగే సురేష్ బాబు గారు మా సినిమాని తీసుకున్నారు. 2026 జనవరి 1న సినిమా వస్తుంది.
ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. అయితే అనుకోని పరిస్థితులలో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. అప్పుడు నిజంగానే భయపడ్డాను. అయితే ఏం జరిగినా మన మంచికే ధైర్యంగా ఉండాలి అని చెప్పిన మా నాన్న గారి మాట గుర్తొచ్చింది. మళ్లీ ఒక ఉత్సాహంతో ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అందరి ముందుకు వస్తున్నా. 100% చెబుతున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా చాలా బలంగా ఉంటుంది. మేము చాలా మంచి సినిమా తీశాం. అది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని చెప్పారు.






