- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
200 మంది కష్టం వృధా కావడంతో చాలా బాధేసింది.. ‘సైయారా’ హిట్‌పై అనుపమ్ ఖేర్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam Kher)ఇటీవల ‘తన్వి ది గ్రేట్’ (Thanvi the Great)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam Kher)ఇటీవల ‘తన్వి ది గ్రేట్’ (Thanvi the Great)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. జూలై 18న మరో సినిమా ‘సైయారా’(Saiyara)తో పాటు రిలీజ్ అయింది. అయితే ఈ ప్రేమ కథ ముందు ఓడిపోయింది. ‘సైయారా’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ్ ఖేర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘తన్వి ది గ్రేట్ సినిమా కోసం నాలుగేళ్ల చాలా కష్టపడ్డాను. స్క్రిప్ట్, సంగీతం ఇలా ఒక్కో దానికి ఒక్కో ఏడాది పని చేశాను. ‘సైయారా’ సినిమాను విడుదల చేసిన రోజు ‘తన్వి ది గ్రేట్’ రిలీజ్ చేశా.
కానీ ఆ సినిమాకు వచ్చిన ఆదరణ మాకు రాలేదు. నాతో పాటు మా టీమ్‌లో ఉన్న 200 మంది కష్టం వృధా కావడంతో చాలా బాధపడ్డారు. మా సినిమా విడుదల కోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. నెల రోజులు వాయిదా కూడా వేశాం. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఎంతోమందిని ఆర్థికంగా సహాయం చేయమని అడిగాను. నా స్నేహితులు కొందరు సహాయం చేశారు. మా సినిమాను కేన్స్‌లో ప్రదర్శించడంతో పాటు భారత రాష్ట్రపతికి కూడా చూపించాం. అందరూ ప్రశంసించారు. కానీ హిట్ మాత్రం కాలేదు. ఒక ప్రేమ కథను చూడాలనుకున్నారు కాబట్టి ‘సైయారా’ను ఆదరించారు. హిట్ అయిన సినిమా కోసం 400 థియేటర్‌లలో రన్ అవుతున్న చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేశారు’’ అని చెప్పుకొచ్చారు.






