కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.. ఎక్జైటింగ్ చాప్టర్ రాబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-16 09:23:51  IST  )

యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) తెలుగులో నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం వంటి మూవీస్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.. ఎక్జైటింగ్ చాప్టర్ రాబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) తెలుగులో నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం వంటి మూవీస్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక కోలీవుడ్‌లో ఈ అమ్మడు కెప్టెన్ మిల్లర్, జాబిలమ్మా నీకు అంత కోపమా వంటి సినిమాలు చేసి వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే గత ఏడాది నాని సరసన ‘సరిపోదా శనివారం’ మూవీలో నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ప్రియాంక నటనకు ఫుల్ మార్కులు పడటంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీలో నటిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక మోహన్ తమిళంలో ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్(kevin) సరసన రొమాన్స్ చేయనుంది. ఈ సినిమా ‘కెవిన్-9’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రానికి కెన్ రాయ్‌సన్(Ken Royson) దర్శకత్వం వహిస్తుండగా.. థింక్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి అఫ్రో సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. నేడు ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

‘‘కొత్త ప్రారంభం, కొత్త ఉత్సాహంతో మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్తేజకరమైన అధ్యాయానికి నాంది పలికిన పూజా కార్యక్రమం నుంచి కొన్ని ఫొటోలు మీ కోసం షేర్ చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఇందులో ప్రియాంక మోహన్ గోల్డ్, మెరున్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న పట్టు చీరలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హీరోతో కలిసి దీపం వెలిగిస్తూ అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు వావ్, గార్జియస్ అంటూ అమ్మడుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story